Economy

10 మంది కార్పొరేట్ల రుణాలు 13 లక్షల కోట్లు

కార్పొరేట్లకు భారీగా పన్ను రాయితీలు ఇవ్వడంతో పాటు ఏటా లక్షల కోట్లలో రుణాలు మాఫీ చేయిస్తోందని మోదీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలోనే విమర్శలు ఉన్నాయి. గత ఎనిమిది సంవత్సరాలలో సుమారు రూ. 14.5 లక్షల కోట్ల కార్పొరేట్ రుణాలను మొండి బకాయిల జాబితాలో చేర్చి మాఫీ చేశాయి జాతీయ బ్యాంకులు. ఇంత భారీ మొత్తంలో రుణాలు మాఫీ చేసినా నిరర్థక ఆస్థులు (ఎన్.పి.ఎ.లు) ఇంకా భారీగా పొగుపడి ఉన్నాయి. వాటిలో అధిక భాగం ఉద్ధేశపూర్వకంగా రుణాలు ఎగవేస్తున్న బడా వ్యాపారులవే అనడంలో సందేహం లేదు.

మొత్తం బ్యాంకు రుణాల్లో బడా కార్పొరేట్ల వాటా గణనీయంగా ఉంది. కేవలం 10 మంది కార్పొరేట్ల వద్ద పోగుబడిన బ్యాంకు రుణాల మొత్తం రూ. 12,71,604 కోట్లు. స్టాక్ మార్కెట్ కుంభకోణంతో తాజాగా ప్రపంచ ఖ్యాతి గడించిన గౌతమ్ అదానీ అందులో ఉంటారని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. సెంట్రల్ రిపాజిటరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆన్ లార్జ్ క్రెడిట్స్ (సి.ఆర్.ఐ.ఎల్.సి)కి వచ్చిన సమాచారం ప్రకారం 2022 సెప్టెంబరు నాటికి ఉన్న పరిస్థితి ఇది.

లోక్ సభలో ఓ ప్రశ్నకు సోమవారం ప్రభుత్వం ఇచ్చిన సమాధానం ప్రకారం.. టాప్ 10 రుణ గ్రహీతలకు ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ. 8,10,941 కోట్లు, ప్రైవేటు రంగ బ్యాంకులు రూ. 3,70,973 కోట్లు, విదేశీ బ్యాంకులు రూ. 88,998 కోట్లు, స్వల్ప రుణాల బ్యాంకులు రూ. 692 కోట్లు ఇచ్చి ఉన్నాయి. మొత్తంగా వాణిజ్య బ్యాంకులు రూ. 12,71,604 కోట్ల మేరకు రుణాలను కేవలం 10 మంది చేతుల్లో పెట్టాయి.

Related Posts