Telangana

‘భారత్ బంద్’కు టిఆర్ఎస్ మద్ధతు

కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు ఈ నెల 8న చేపట్టిన భారత్ బంద్ కు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు మద్ధతు ప్రకటించారు. బంద్ కు టిఆర్ఎస్ సంపూర్ణ మద్ధతు ఇస్తుందని, పార్టీ శ్రేణులు బంద్ లో పాల్గొంటారని ఆదివారం వెల్లడించారు. రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉన్నందునే పార్లమెంటులో వ్యవసాయ బిల్లులను టిఆర్ఎస్ వ్యతిరేకించిందని కేసీఆర్ గుర్తు చేశారు.

కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు న్యాయమైన పోరాటం చేస్తున్నారని కేసీఆర్ సమర్ధించారు. ఆ చట్టాలను ఉపసంహరించుకునేంత వరకు పోరాటం కొనసాగించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.