Featured

నూతన పార్లమెంటుకు మోదీ శంకుస్థాపన

నూతన పార్లమెంటు భవన నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ గురువారం శంకుస్థాపన చేశారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంతో 2022 నాటికి కొత్త పార్లమెంటు నిర్మాణం పూర్తి చేయాలన్నది ప్రణాళిక. అయితే, మొత్తం ఈ ప్రాజెక్టుపై వెలువడిన అభ్యంతరాలను సుప్రీంకోర్టు పరిశీలిస్తోంది. ఇప్పటికి పార్లమెంటు భవన శంకుస్థాపనకు మాత్రమే కోర్టు అనుమతించింది. నిర్మాణాలను చేపట్టవద్దని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో మోదీ శృంగేరి మఠంనుంచి వచ్చిన పూజారులతో ‘భూమి పూజ’ క్రతువును పూర్తి చేశారు.