Featured

అంబేద్కర్ కల నిజం చేయడానికి కట్టుబడి ఉన్నాం: ప్రధాని మోదీ

దేశం కోసం అంబేద్కర్ కన్న కలలను నిజం చేయడానికి తాము కట్టుబడి ఉన్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. బిఆర్ అంబేద్కర్ 64వ జయంతి సందర్భంగా ఆయనకు మోదీ నివాళులు అర్పించారు. భారత రాజ్యాంగ నిర్మాతల్లో అగ్రగణ్యుడు, దళితుల అభ్యున్నతికోసం పాటు పడిన దార్శనికుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1956లో మరణించారు.

అంబేద్కర్ ఆలోచనలు, ఆదర్శాలు లక్షలాది మందికి బలాన్నిస్తూనే ఉన్నాయని మోదీ ఆదివారం ఒక ట్వీట్ లో కొనియాడారు.