కస్టడీ మరణాల్లో పేదలవే అధికం (71.58 శాతం) అని నేషనల్ క్యాంపెయిన్ అగనెస్ట్ టార్చర్ అనే ఢిల్లీ సంస్థ ప్రకటించింది. 1996-97 నుంచి 2017-18 వరకు జాతీయ మానవ హక్కుల కమిషన్ నివేదికలను విశ్లేషించి, గురువారం మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా వెల్లడించింది. 2017-18 వరకు 11 సంవత్సరాలలో ఎన్.హెచ్.ఆర్.సి. ప్రస్తావించిన 95 కస్టడీ మరణాల్లో 68 మంది బాధితులు పేద కుటుంబాలవారని తేలింది. ముగ్గురు (3.019 శాతం) మధ్యతరగతి వారని, 24 మంది (25.26 శాతం) ఆర్థిక స్థితి తెలియదని పేర్కొంది. నిస్సందేహంగా వారిలో మెజారిటీ పేదలే ఉంటారు.